Header Banner

ఏపీకి మరో గుడ్‌ న్యూస్‌! త్వరలోనే మిస్సైల్ టెస్టింగ్ సెంటర్ ప్రారంభం.. దేశ భద్రతలో ఏపీ కీలక పాత్ర!

  Sun Apr 06, 2025 17:07        Politics

భారతదేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో దేశంలో మరో మిస్సైల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ నిర్మాణానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అనువైన ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగానే 2011లో ఏపీకి ఈ ప్రాజెక్టును కేటాయించింది. అప్పట్లోనే ఈ మిస్సైల్ సెంటర్ నిర్మాణానికి కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద గ్రామం అనువైన ప్రాంతంగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. ఈ గ్రామం సముద్రతీర ప్రాంతంలో ఉండటం, గ్రామం చుట్టుపక్కల 6-8కిలోమీటర్ల మేర ఎలాంటి జనావాసాలు లేకపోవడంతో మిస్సైల్ టెస్టింగ్‌ ప్రయోగాలకు ఈ గ్రామం అనుకూలంగా ఉంటుందనే భావనకు వచ్చారు. అయితే అప్పుడే ప్రాజెక్టుకు భూమిని కేటాయించాలని డీఆర్‌డీవో అధికారులు కొరగా ..రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇది కాస్తా ఆలస్యమైంది. ఇక ఏపీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 2017లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం 300 ఎకరాలకుపైగా భూమిని డీఆర్‌డీవో కు కేటాయించింది. అయితే పర్యావరణ అనుమతులు మరియు ఇతర అడ్డంకుల కారణంగా కొన్నేళ్లపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైంది. దీంతో 2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు లభించడంతో 2021లో ఆ స్థలాన్ని డీఆర్‌డీవో స్వాధీనం చేసుకొంది.


ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం నుంచి మరో బహుమతి! ఆ 11 నగరాల్లో! భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!


ప్రాజెక్టుకు కేటాయించిన ప్రాంతం చుట్టూ ప్రహారి గోడను నిర్మించింది. కానీ ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన మాత్రం జరగలేదు. అయితే ఈ ఏడాది జనవరిలోనే ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో ఈ కేంద్రానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేయించడానికి అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో రద్దైనట్టు అధికారులు తెలిపారు. ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు కావడంతో ప్రధాని మోదీయే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. అయితే అమరావతి నిర్మాణ పనుల శంకుస్థాపనతో పాటు ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను కూడా మోదీ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఈ మిస్సైల్‌ టెస్టింగ్ సెంటర్ నిర్మాణం పూర్తయితే, ఇది ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ తర్వాత భారతదేశంలో రెండవ ప్రధాన క్షిపణి పరీక్షా కేంద్రంగా మారుతుంది. ఇది షార్ట్-రేంజ్ మరియు లాంగ్-రేంజ్ క్షిపణుల పరీక్షలకు సహాయపడుతుంది, దీనివల్ల భారత రక్షణ రంగంలో స్వావలంబన మరియు సాంకేతిక పురోగతి సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కల్పిస్తూ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుందని ఏపీ ప్రజలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఆ కీలక ప్రాజెక్టుకు వీడనున్న సంకెళ్లు! మంత్రి సంచలన నిర్ణయం!

 

వివేక హత్య వెనుక మర్మం! అసలు వ్యక్తి మొదట అక్కడే! ఆ తర్వాత ఏం జరిగిందంటే?

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AndhraPradesh #MissileTestingCenter #DefenseBoost #DRDO #NationalSecurity